సంచలనం పాదయాత్ర కి రెడీ అవుతున్న ప్రియాంక గాంధీ..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ తలపెట్టిన పాదయాత్ర.అప్పట్లో ఏపీలో అడ్రస్ లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి చేర్చడం తెలిసిందే.

అదే సమయంలో వైయస్ ఏపీలో రెండుసార్లు గెలిచిన క్రమంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.వైయస్ మరణం అనంతరం రాష్ట్ర విభజన జరిగిన టైంలో.

చంద్రబాబు తలపెట్టిన "మీకోసం" పాదయాత్ర.కూడా అప్పట్లో 2014 ఎన్నికల టైంలో టిడిపిని ఏపీలో అధికారంలోకి వచ్చేలా చేసింది.ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ తలపెట్టిన "ప్రజా సంకల్ప" పాదయాత్ర.2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చే టట్లు చేసింది.ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో "ప్రజా సంగ్రామ" పాదయాత్ర అంటూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర చేస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ దాదాపు పన్నెండు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి రెడీ అయినట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.కచ్చితంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా.

Advertisement

యూపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ యాత్ర చేయనున్నట్లు సమాచారం.చేయబోయే ఈ యాత్ర కి "ప్రతిజ్ఞ యాత్ర" అనే టైటిల్ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి కి.వ్యతిరేకంగా సర్వేలు వస్తూ ఉండటంతో.ఎలాగైనా ఈసారి దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీలో బిజెపిని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ కంకణం పట్టుకుంది.

ఇదే సమయంలో సమాజ్వాది పార్టీ, బిఎస్పి పార్టీ నాయకులు కూడా.యూపీలో ఎవరికివారు యాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు