గుర్తుపెట్టుకోండి.. భీమ్లా నాయక్‌ను మించి ఉండబోతున్న డానీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పవర్‌ఫుల్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ను ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేయగా, అది యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది.

భీమ్లా నాయక్ లాంటి పవర్‌ఫుల్ పాత్రలో పవన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక ఈ టీజర్‌ను పదే పదే చూస్తూ తమ హీరో డైలాగులకు విజిల్స్ వేస్తున్నారు.అయితే ఈ టీజర్‌పై కొంతమంది మాత్రం పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీ అయిన ఈ సినిమాలో మరో హీరో పాత్రకు సంబంధించి ఎలాంటి గ్లింప్స్ ఇవ్వలేదని వారు అంటున్నారు.దీనికి ఈ సినిమా నిర్మాత అఫీషియల్‌గా క్లారిటీ కూడా ఇచ్చాడు.

అన్నీ ఒకేసారి కావాలంటే జరగవు.సమయాన్ని బట్టి ఒక్కోటి జరుగుతాయని, అలాగే ఈ సినిమా నుండి కూడా ఒక్కో అప్‌డేట్స్ వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యూనిట్‌పై రానా దగ్గుబాటి పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్‌పై ప్రెషర్ పెరుగుతుండటంతో ఆ పాత్రకు సంబంధించిన టీజర్‌ను కట్ చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా, రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ అనే పాత్రలో నటిస్తున్నారు.

ఈ రెండు పాత్రలు కూడా పర్ఫార్మెన్స్ పరంగా భీమ్లా నాయక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.కాగా మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ వస్తుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర అద్భుతంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి రానా దగ్గుబాటి సారీ డానీకి సంబంధించిన టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు