భార‌త్ స్ట్రెయిన్ వేరియంట్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డ‌బ్ల్యూహెచ్‌వో

క‌రోనా వ‌చ్చి రెండేళ్లు గ‌డుస్తున్నా కూడా ఇంకా దాని ప్ర‌భావం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది.ఇంకా కూడాచాలా ప్రాంతాల్లో దీని ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉంది.

ఇక మ‌న దేశంలో కూడా మొన్న‌టి వ‌ర‌కు మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్టుకునే ప‌రిస్థితులు వ‌చ్చాయంటే ఎంత‌లా వ్యాప్తి చెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అయితే మ‌న దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ లో భాగంగా భార‌త్‌లో కొత్త ర‌కం క‌రోనా స్ట్రెయిన్‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇవి చాలా స్ట్రాంగ్ గా మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.ఇక మ‌న భారత్ లో స్ట్రెయిన్ తో పాటు డబుల్ మ్యుటెంట్ వైరస్ అయిన B.1.617 వేరియంట్లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ సైంటిస్టులు చెబుతున్నారు.అయితే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వేరియంట్ కాస్తా 17 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివ‌రించింది.

కేవ‌లం ఈ క‌రోనా వేరియంట్ కార‌ణంగానే భార‌త్‌లో కొవిడ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోయింద‌ని డబ్ల్యూహెచ్‌వో స్ప‌ష్టం చేసింది.ఇక కరోనా పరిస్థితుల గురించి, ప్ర‌పంచంలో అది విస్త‌రిస్తున్న తీరు గురించి వారానికి ఒకసారి డ‌బ్ల్యూహెచ్ వో నిర్వ‌హించే మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్ల‌డించింది.

Advertisement

నిజానికి భార‌త్లో డ‌బుల్ మ్యుటెంట్ జ‌రిగి వైరస్‌లో జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా ఈ కొత్త‌ర‌కం వేరియంట్లు పుట్టుకొచ్చాయని డ‌బ్ల్యూహెచ్‌వో వివ‌రించింది.ఇక ప్ర‌పంచం వ్యాప‌త్ంగా ఏప్రిల్ నెల 27 వ తేదీ నాటికి 1,200కు పైగా స్ట్రెయిన్ ర‌కాల‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో సైంటిస్టులు స్ప‌ష్టం చేశారు.ఇక ఇలాంటి వేరియంట్లు మ‌రింత పుట్ట‌కొచ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని, కాబ‌ట్టి వేరియంట్లు మ్యుటేష‌న్ జ‌రిగిన‌ప్పుడ‌ల్ల కొత్త ర‌కం వైర‌స్‌లు మ‌రింత బ‌లంగా పుట్ట‌కొస్తాయంటూ వారు వెల్ల‌డించారు.

ఇక ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ కొన‌సాగుతోందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు