తల్లి వంటకాలలో పీవీ సింధు కి ఇష్టమైన వంటకం అదేనట..!!

బ్యాడ్మింటన్ స్టార్ తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించడం తెలిసింది.

వరుసగా రెండుసార్లు ఒలంపిక్ క్రీడలలో పథకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా.

పీవీ సింధు రికార్డు సృష్టించడం జరిగింది.దీంతో ఫోన్ పిక్స్ ముగించుకుని స్వదేశం లో అడుగుపెట్టిన ఆమెకి ఢిల్లీలో అదే రీతిలో హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది.

ఢిల్లీలో అయితే కేంద్ర క్రీడా విభాగంలో పలువురు కేంద్ర మంత్రులు పీవీ సింధు ని సత్కరించారు.ఖచ్చితంగా వచ్చే ఒలంపిక్స్ లో.బంగారు పతకం సాధించడం జరుగుతుందని అన్నారు.

ఢిల్లీ తర్వాత హైదరాబాదులో అడుగుపెట్టిన పీవీ సింధుకి.అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పట్టారు.ఇటువంటి తరుణంలో తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.

Advertisement

పీవీ సింధు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.రెండుసార్లు మెడల్స్ ఒలంపిక్స్ లో రావడం చాలా సంతోషంగా ఉందని, నా కల రెండోసారి నిజమయ్యింది.చాలా ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నారు.2016 లో సిల్వర్ మెడల్ రావడంతో తన లైఫ్ మారిపోయిందని.రెండోసారి కూడా రావడం అంత ఈజీ కాదు కానీ వచ్చింది అంటే దానికి ప్రధాన కారణలలో ఒకటి తల్లిదండ్రులు అని చెప్పుకొచ్చింది.

ఒత్తిడిలో తనని ప్రోత్సహించే విషయంలో తన తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉన్నతమని పేర్కొంది.ఇదిలా ఉంటే తన అమ్మ చేసే వంటకాలలో పులస చేప కూర అంటే ఎంతో ఇష్టమని త్వరలోనే ఆ వంటకం తో కుటుంబ సమేతంగా భోజనం చేస్తామని, ఎంజాయ్ చేస్తామని పీవీ సింధు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు