కులాల వారీగా హుజూరాబాద్‌లో దిగుతున్న మంత్రులు.. రేపు త‌ల‌సాని ప్రోగ్రామ్‌!

గ‌తంలో తెలంగాణ‌లో ఎన్నో ఎన్నిక‌లు వ‌చ్చాయి.ఎన్నో ఉప ఎన్నిక‌లు కూడా వ‌చ్చాయి.

కానీ వాటిల్లో దేనికీ ద‌క్క‌నంత ప్రాధాన్యం కేవ‌లం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో.ఎందుకంటే మేజ‌ర్ ఎన్నిక‌లు వ‌స్తే ఎన్ని ర‌కాల హామీలు ఇస్తారో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు కూడా అన్నే ర‌కాల హామీలు ఇవ్వ‌డం కొత్త స్కీములు స్టార్ట్ చేయ‌డం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇప్పుడు హుజూరాబాద్ కోస‌మే కొత్త‌గా కేసీఆర్ ద‌ళిత బంధు స్కీమ్‌ను కూడా తీసుకొస్తున్నారు.అలాగే ఆగిపోయిన స్కీముల‌ను మ‌ళ్లీ హుజూరాబాద్‌లోనే స్టార్ట్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు అన్ని కులాల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇప్పుడు కేసీఆర్ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు.మేజ‌ర్‌గా ఓట్లు ఉన్న ద‌ళితుల కోసం ద‌ళిత‌బంధు స్కీమును పెట్టిన కేసీఆర్ ఇప్పుడు మిగిలిన అన్ని కులాల‌ను ఆక‌ట్టుకునేందుకు కులాల వారీగా మంత్రుల‌ను రంగంలోకి దింపుతున్నారు.

Advertisement

ఇప్ప‌టికే ద‌ళితుల కోసం కొప్పుల ఈశ్వ‌ర్‌ను, గిరిజ‌నుల కోసం మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ను రంగంలోకి దింపారు.అలాగే గీత కార్మికుల కోసం శ్రీనివాస్ గౌడ్‌ను, రెడ్డి సామాజిక వ‌ర్గం కోసం ధ‌ర్మారెడ్డి, పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది అధిష్టానం.

ఇక ఇప్పుడు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న యాద‌వుల కోసం శ్రీనివాస్ యాద‌వ్‌ను దింపుతోంది.

ఇందుకోసం ఇప్పుడు రాష్ట్రంలో ఎక్క‌డా ప్రారంభించ‌ని రెండో విడ‌త గొర్రెల పంపిణీని ఇప్పుడు హుజూరాబాద్‌లో ప్రారంభిస్తోంది.రేపు త‌ల‌సాని చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం స్టార్ట్ కాబోతోంది.అంటే కులాల వారీగా ఆయా మంత్రుల‌తో స్కీముల‌ను మ‌ళ్లీ స్టార్ట్ చేస్తోంద‌న్న‌మాట‌.

మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం కేసీఆర్ ఎన్ని ర‌కాలుగా ఎత్తుగ‌డ‌లు వేయాల్నో అన్ని ర‌కాలుగా వేస్తోంది.మ‌రి ఆయ‌న ప్లాన్లు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయో.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు