తెలంగాణ రాజకీయాల్లో నల్గొండది ఎప్పుడూ ప్రాధాన్యమనే చెప్పాలి.ఎందుకంటే మొదటి నుంచి ఈ జిల్లాకు చెందిన నాయకులే ప్రధానంగా కాంగ్రెస్ను ఏలుతూ వస్తున్నారు.
అంతే కాదు వివిధ రాజకీయ పార్టీల్లో కూడా ఈ జిల్లాకు చెందిన నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇక మొదటి నుంచి ఈ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేని పేరుగా వీరు పాపులారిటీ పొందారు.
ఇక నల్గొండ రాజకీయాలను మొదటి నుంచి శాసిస్తున్న ఈ ఫ్యామిలీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో చెప్పలేం.ఇక ఇన్ని రోజుల తర్వాత మళ్లీ నల్గొండ రాజకీయాలు భగ్గుమంటున్నాయి.
ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మంత్రి జగదీశ్ రెడ్డి టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు.నల్గొండలోని వివిధ నీటి పారుదల ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కూడా తీసుకురాని మంత్రి ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ వివాదాస్పద కామెంట్లకు దిగారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.అయితే మొదటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.
ఈ విధంగా విమర్శలు చేసుకోవడం వీరిద్దరికీ కొత్తమీ కాకపోయినా కూడా ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు నల్గొండ పర్యటనలో భాగగా నార్కెట్పల్లిహోటల్లో ఎంపీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
నిజంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ఆత్మసాక్షి ఉంటే గుండె మీద చెయ్యి వేసుకుని తాను మంత్రి పదవికి అర్హుడనే అని ఒక్క సారైనా చెప్పాలని, ఆయన జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కోమటిరెడ్డి.ప్రస్తుతం జగదీశ్ రెడ్డికి నల్గొండ జిల్లాలో తిరగాలంటే భయం వేసి నిత్యం పోలీసుల సెక్యూరిటీ మధ్యనే వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.ప్రస్తుతం అన్ని జిల్లాలకు వస్తున్న కేసీఆర్ నల్గొండకు ఎందుకు రావట్లేదని, తనకు ఎందుకు ఆహ్వానం ఇవ్వట్లేదని నిలదీశారు.
జిల్లాకు ఇన్ చార్జి మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి మాత్రం వీటిపై స్పందించట్లేదని ఆయన విమర్శించారు.