ఈట‌ల పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు ఆ ఎమ్మెల్యేతో కేసీఆర్ ప్లాన్..?

మొన్న‌టి దాకా ఈట‌ల రాజేంద‌ర్ నుంచి ప్ర‌జ‌ల ఫోక‌స్ కాస్త రేవంత్‌రెడ్డి చుట్టూ తిరిగింద‌నే చెప్పాలి.

కానీ ఇప్పుడు తెర‌మీద‌కు మ‌ళ్లీ ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయం వ‌చ్చేసింది.

ఇప్పుడు ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌ల్లీ హ‌ల్ చ‌ల్ కావ‌డం మొద‌ల‌య్యాయి.ఇప్ప‌డు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్న ఆయ‌న ఎలాగైనా గెలిచిన త‌న పంతం నెగ్గించుకోవాల‌ని ట్రై చేస్తున్నారు.

ఇక ఇదే క్ర‌మంలో ఎంతోమందికి క‌లిసి వ‌చ్చిన పాద‌యాత్ర‌ను ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ట్రై చేస్తున్నారు.అయితే త‌న పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి కేసీఆర్ ఆ ఎమ్మెల్యేతో కుట్ర చేస్తున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

ఈట‌ల రాజేంద‌ర్ తన పాదయాత్రకు అన్ని ర‌కాలుగా ప‌ర్మిష‌న్ తీసుకున్న‌ప్ప‌టికీ కావాల‌నే టీఆర్ ఎస్ నేత‌లు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.పాద‌యాత్ర చేస్తే క‌చ్చితంగా ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ కుట్ర‌లు ప‌న్ని అడ్డుకునేందుకు ప్లాన్ చేశాడ‌ని ఆరోపిస్తున్నారు.

Advertisement

పాద‌యాత్ర‌లో భాగంగా త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు మధ్యాహ్న భోజనం కోసం నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటుంటే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు చెందిన అనుచ‌రులు స‌ద‌రు రైస్ మిల్ యజమానులను బెదిరించి తమ వంట సరుకులను సీజ్ చేయించార‌ని ఇంత‌కంటే దారుణం ఇంకేం ఉంటుంద‌ని మాజీ మంత్రి ఈటల మండిప‌డ్డారు.

ఈ అడ్డంకుల‌న్నీ కూడా సీఎం కేసీఆర్ కనుసన్నల్లో, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఆదేశాల‌తో జ‌రుగుతున్నాయంటూ మండిప‌డ్డారు.స‌ద‌రు ధ‌ర్మారెడ్డి చేస్తున్న ఇలాంటి అప్రజాస్వామిక పనులు ఎన్ని చేసినా కూడా ప్ర‌జ‌లు త‌న‌నే గెలిపిస్తారంటూ ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.ఇక ఇప్పుడు త‌న విజ‌యాన్ని ఎవ‌రూ అడ్డుకోలేరని, త్వ‌ర‌లోనే హుజూరాబాద్‌లో బీజేపీ జెండా ఎగ‌రుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

మ‌రి ఆయ‌న అన్న‌ట్టుగానే చల్లా ధ‌ర్మారెడ్డి ఈ విమ‌ర్శ‌ల‌పై ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తార‌నేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ సాగుతోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు