పాదయాత్రలో భాగంగా తమ కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం కోసం నియోజకవర్గంలోని ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటుంటే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన అనుచరులు సదరు రైస్ మిల్ యజమానులను బెదిరించి తమ వంట సరుకులను సీజ్ చేయించారని ఇంతకంటే దారుణం ఇంకేం ఉంటుందని మాజీ మంత్రి ఈటల మండిపడ్డారు.
"""/"/
ఈ అడ్డంకులన్నీ కూడా సీఎం కేసీఆర్ కనుసన్నల్లో, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో జరుగుతున్నాయంటూ మండిపడ్డారు.
సదరు ధర్మారెడ్డి చేస్తున్న ఇలాంటి అప్రజాస్వామిక పనులు ఎన్ని చేసినా కూడా ప్రజలు తననే గెలిపిస్తారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇప్పుడు తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, త్వరలోనే హుజూరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మరి ఆయన అన్నట్టుగానే చల్లా ధర్మారెడ్డి ఈ విమర్శలపై ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.