హీరో అజిత్ కి స్పోర్ట్స్ బైక్స్ అంటే ప్రాణం అనే విషయం ఆయన అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.అంతేకాదు స్వయంగా రేసర్ అజిత్ అనే విషయం కూడా మనకు తెలిసిందే.
ఇక సినిమాల్లో కొన్ని సందర్భాల్లో యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండానే నటిస్తాడు.అజిత్ దగ్గర అనేక స్పోర్ట్స్ బైక్, రేస్ కార్స్ ఉన్నాయి ఇప్పుడైతే అజిత్ కి స్టార్ డం ఉంది కానీ ఒకప్పుడు అలా కాదు చాలా కష్టాలు పడ్డాడు.
అజిత్ ఎంతో ప్రేమగా ఒక బుల్లెట్ బండి ని కొనుక్కున్నాడు.కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆ బైక్ అమ్ముకోవాల్సి వచ్చిందట.
ఈ విషయం బయట పెట్టింది మరెవరో కాదు అజిత్ కి స్వయానా పెద్ద అభిమాని మరియు అతని అనుచరూఢిగా చెప్పబడే సంపత్ రావు.దీన మూవీ లో సంపత్ రావు నటించాడు.
బైక్ అమ్ముకున్న విషయం బయటపెట్టడంతో ఆయన అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇంటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితి నుంచి అజిత్ వచ్చాడని అనేక క్లిష్టమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు కానీ ఇప్పుడు దేశంలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా అజిత్ ఉన్నాడని దీన్నిబట్టి ఎంత శ్రమ జీవి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు తెలిపాడు సంపత్ రావు.

అంతే కాదు ఆ బైక్ దీన సినిమాలో ఉపయోగించారట.అజిత్ ఈ చిత్రం 2001లో వచ్చింది అంతే కాదు అజిత్ కి బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఇచ్చి తన కెరియర్ ని ఎంతో మార్చేసింది.ఈ సినిమా తర్వాత అజిత్ ని ‘తల’ అనే ముద్దు పేరుతో ఆయన అభిమానులు పిలుచుకుంటున్నారు.

ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో అజిత్ హీరోగా నటిస్తుండగా కార్తికేయ విలన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ నటి హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా లో లో సైతం భారీ యాక్షన్ సీన్లు చేయబోతున్నాడట అజిత్.