రామరావు సినిమాలో రవితేజ ఎమ్మార్వో కాదట..!

మాస్ మహరాజ్ రవితేజ నూతన దర్శకుడు శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ.చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటిస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరక్టర్ శరత్ మండవ.సినిమాలో రవితేజ సబ్ కలక్టర్ గా నటిస్తున్నారని చెప్పారు.

నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు.క్రాక్ హిట్ తో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇక రామారావు సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.

Advertisement

సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో రవితేజ రెండు విభిన్న వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో మెప్పిస్తారని చెబుతున్నారు.

ఖులాడి, రామారావు ఈ రెండు సినిమాలతో కూడా రవితేజ తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు.ఈ సినిమాల తర్వాత రవితేజతో సినిమా కోసం నక్కిన త్రినాథ రావు వెయిటింగ్ లో ఉన్నాడు.

 ఆ క్రేజీ కాంబో సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు