2023 ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందో జోస్యం చెప్పిన కుమారస్వామి..!!

జెడిఎస్ ముఖ్యమంత్రి కుమారస్వామి 2023 వ సంవత్సరం లో కర్ణాటక రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పారు.

తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పుకొచ్చారు.

దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక మిగతా రాష్ట్రాలు మొత్తం జాతీయ పార్టీలను తిరస్కరించడం జరిగిందని .ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో కర్ణాటకలో కూడా జాతీయ పార్టీలకు ప్రజలు పంగ నామం పెట్టడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.అంతే కాకుండా కర్ణాటకలో జెడిఎస్ ప్రధాన ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు.

పరిస్థితి ఇలా ఉండగా మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరపాలని డిమాండ్ చేస్తున్న బిజెపి .కర్ణాటకలో మాత్రం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదని మండిపడ్డారు.కనీసం రాష్ట్రంలో రెండు మూడు రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కుమారస్వామి డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ఇంకా అనేక విషయాలు చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కర్ణాటక గవర్నర్ వజుభాయి వాలా, స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరికి కుమారస్వామి లెటర్ లు రాయడం జరిగింది.

Advertisement
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు