ఆనందయ్యకు సెల్యూట్ చేసిన మద్రాస్ హైకోర్టు జడ్జిలు

కరోనాకి మందుగా ఆనందయ్య ఇస్తున్న ఔషధంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

కృష్ణపట్నం ఆనందయ్య మందుపై ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగ ఆనందయ్య మందు ప్రస్తావన తీసుకు వచ్చారు.

ఏపీలో కరోనా మందు ఆనందయ్య తయారు చేసి ఉచితంగా అందించడంపై హైకోర్ట్ జడ్జిలు ప్రశంసించారు.ఈ సందర్భంగా సొంత డబ్బులతో ఆనందయ్య కరోనా మందు తయారు చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నందుకు జస్టిస్ తమిళ్ సెల్వి, జస్టిస్ కరుణాకరన్ సెల్యూట్ చేశారు.

ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెబుతూ ఆనందయ్యని అభినందించారు.డీఆర్డీఓ తయారు చేసిన 2 డీజీ మందు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ కామెంట్స్ చేశారు.

ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పూర్తి సహకారం అందించడం లేదని ఆనందయ్య అన్నారు.కొన్నిచోట్ల ఈ ఔషధాన్ని డబ్బులకు అమ్మడంపై ఆనందయ్య సీరియస్ అయ్యారు.

Advertisement

తాను సేవగా చేస్తున్న ఈ ఔషధ పంపిణీని కొందరు సొమ్ము చేసుకోవాలని చూడటం ఏమి బాగాలేదని అన్నారు.వారిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు.

ఆనదయ్య మందు పంపిణీ అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం అందించే ఆలోచన చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు