చీరకట్టులో తాప్సీ.. రోడ్డుపై హడావుడి చేస్తూ?

టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన అందంతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన పోస్టులను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.

ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సొట్ట బుగ్గల సుందరి తొలిసారి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టగా అక్కడే సెటిల్ అయిపోయింది తాప్సీ.

Advertisement

ఇక ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో దృష్టి పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా చీర కట్టులో కనిపించగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తన సోదరి షాగున్ తో రష్యాలో తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇక ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ డిన్నర్ కు అటెండ్ అవ్వగా ఆ పార్టీకి స్పెషల్ సారీలో వెళ్ళింది.

దీంతో తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో రోడ్డుపై హడావుడిగా పరుగులు తీస్తున్నట్టు కనిపించగా అందులో బ్లూ కలర్ బ్లౌజ్ ధరించి సమ్మర్ చీరతో బాగా ఆకట్టుకుంది.పైగా చేతికి గాజులు ధరించుకొని ఫోటోకు పోజులిచ్చింది.

ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజనులు తాప్సి చీరకట్టు అందాలను చూసి మెచ్చుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలలో బిజీగా ఉండగా.తను ఇటీవలే నటించిన హసీనా దిల్ రుబా త్వరలోనే విడుదల కానుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అంతేకాకుండా లూప్ లపేటా, రష్మీ రాకెట్, శాభాష్ మిట్టు సినిమాలలో బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు