ఏపీ శాసనమండలి లో నాలుగు కొత్త ముఖాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో అధికార పార్టీ వైసీపీకి బలం పుంజుకుంటుంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అధికంగా ఉండే వాళ్ళు.

అయితే ఆ సమయంలో అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు తీర్మానం పొందిన గాని శాసనమండలిలో వీగి పోయేవి.ఈ క్రమంలో చాలా వరకు జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లులు శాసనమండలిలో ఆగిపోయిన పరిస్థితులు గతంలో నెలకొన్నాయి.

పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం శాసనమండలిలో కూడా వైసిపి పార్టీ ఎమ్మెల్సీ సభ్యులు సంఖ్యా పెరిగిపోతుండటంతో.అధికార పార్టీలో జోష్ నెలకొంది.

ఇటీవల గవర్నర్ కోటాలో లెళ్ళ అప్పి రెడ్డి, మోషన్ రాజు, రమేష్ యాదవ్, తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు.ఇటీవల వీరు నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలుపగా.

Advertisement

గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ఇవాళ ప్రోటేం చైర్మన్ బాలసుబ్రమణ్యం.

వీరి చేత ఎమ్మెల్సీలు గా ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ పరిణామంతో శాసనమండలిలో 4 కొత్త ముఖాలు ఎంట్రీ ఇచ్చినట్లయింది.

Advertisement

తాజా వార్తలు