ఈ రోజు కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ అత్యవసర సమావేశం..!!

ఈరోజు తెలంగాణ క్యాబినెట్ మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం కానుంది.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది.

రాష్ట్రంలో కరోనా కేసులు అదేరీతిలో కర్ఫ్యూ , గోదావరి ఎత్తిపోతల పథకాలు, మరియు జల విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం ఇంకా అనేక విషయాల గురించి మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.అదే రీతిలో లాక్డౌన్ పై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చాలావరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్రిక్తత తగ్గిపోవటం జరిగింది.గతంలో కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉంటే ప్రస్తుతం పదిహేను వందల లోపు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి.

మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గి పోయాయి. ఒక విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం లో మహమ్మారి చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చింది.

Advertisement

ఇలాంటి తరుణంలో ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ విషయంలో అనేక సడలింపులు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా ప్రజలకు మరింత వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.  .

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు