నువ్వు యాక్టర్ గా పనికి రావని ఆ డైరెక్టర్ అవమానించాడు... చివరికి...

తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో విలన్ మరియు పాజిటివ్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు "ఆదిత్య మీనన్" గురించి సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.

అయితే నటుడు ఆదిత్య మీనన్ అంటే కొంతమందికి త్వరగా గుర్తు రాక పోవచ్చు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "మిర్చి" చిత్రంలో హీరో బాబాయ్ క్యారెక్టర్ అంటే టక్కున గుర్తు పడతారు.

ఇటీవలే ఆదిత్య మీనన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో భాగంగా తాను సినిమాల్లోకి రాక ముందు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో ఈవెంట్ మేనేజర్ గా పని చేశానని దాంతో అప్పట్లో మంచి జీతం, జీవితం బాగుండేదని కానీ నటనపై ఆసక్తి కలగడంతో అన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు.

అయితే వచ్చీరావడంతోనే ఓ చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చిందని కానీ తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో నటించనని దర్శకుడితో చెప్పడంతో ఆ దర్శకుడు తనని దారుణంగా అవమానించాడని తెలిపాడు.

ఈ క్రమంలో నువ్వు యాక్టర్ గా పనికిరావు, నీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరంటూ కొంతమేర అవమానకరంగా మాట్లాడాడని చెప్పుకొచ్చాడు.కానీ కొంతకాలం తర్వాత తాను మెయిన్ విలన్ గా నటించిన ఓ చిత్రానికి ఆ దర్శకుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని తెలిపాడు.కానీ తనని సినిమా సెట్లో అవమానించిన డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.

Advertisement

ఇక తనకి తెలుగులో మొదటగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "బిల్లా" చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ తమిళంలో బిల్లా చిత్రంలో నటించిన నటీనటులు తెలుగు రీమేక్ లో కూడా కంటిన్యూ చేయడం వల్ల ఆ అవకాశం తనకు వచ్చిందని తెలిపాడు.

అయితే తాను అప్పుడప్పుడు తన బ్లాగ్ లో ఆడవాళ్ళ పై జరుగుతున్న అకృత్యాల గురించి రాస్తూ ఉంటానని తెలిపాడు.ఇందులో మన భారతదేశ సంప్రదాయాల్లో ఆడవాళ్ల గౌరవానికి పెద్దపీట వేశారని, కానీ ఈ మధ్యకాలంలో కొందరు మహిళలపై తీవ్ర ఆకృత్యాలకు పాల్పడుతున్నారని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.అంతేకాక తన దృష్టిలో ఆలుమగలు ఇద్దరూ సమానమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి స్పందిస్తూ తానూ ఇప్పటివరకూ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తదితర భాషలలోని చిత్రాలలో నటించానని కానీ తనని నటుడిగా గుర్తించి ఆదరించింది మాత్రం తెలుగు సినిమా పరిశ్రమని తెలిపాడు.అంతేగాక తెలుగు సినీ పరిశ్రమకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే తనని ఏంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపాడు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు