సూర్యాపేటలో కల్నన్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ..!

గాల్వాన్ లోయలో చైనా సైనికులను అడ్డుకొనే ప్రయత్నంలో కల్నన్ సంతోష్ బాబుతో సహా మరో 20 మంది భారత్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

వారిలో కల్నన్ సంతోష్ బాబు సూర్యపేటకు చెందిన వారు కావడంతో ఆయన స్మారకార్ధం సూర్యపేట పట్టణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

సూర్యాపేట పట్టణం కోర్టు జంక్షన్ వద్ద కల్నన్ సంతోష్ బాబు నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కే.టి.ఆర్ పాల్గొన్నారు.సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి కే.టి.ఆర్ పూల మాల వేసి ఆవిష్కరించారు.ఇక నుండి ఆ చౌరస్తా పేరుని కల్నన్ సంతోష్ బాబు చౌరస్తాగా మార్చుతున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

గతేడాది జూన్ 15వ తేడీన భారత్ చైనా సరిహద్దుల్లో గాల్వాన్ లోయ వ్ద్ద చైనా సైనికులని అడ్డుకునే ప్రయత్నంలో కల్నన్ సంతోష్ వీర మరణం పొందారు.ఈ కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

కల్నన్ సంతోష్ సూర్యపేటకు చెందిన వారు కావడంతో ఆయన జ్ఞాపకార్ధం ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.సూర్యపేట కోర్ట్ సెంటర్ లో కల్నన్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి కే.టి.ఆర్ ఆవిష్కరించారు.ఇకనుండి ఆ చౌరస్తా పేరు కూడా సంతోష్ బాబు చౌరస్తాగా మార్చినట్టు ప్రకటించారు.

Advertisement
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

తాజా వార్తలు