కర్ణన్ రీమేక్ బాద్యతలు వివి వినాయక్ చేతికి

మాస్ చిత్రాల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఫేడ్ అవుట్ స్టేజ్ లో ఉన్న దర్శకుడు వివి వినాయక్.

అయితే వివి వినాయక్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లాంచింగ్ మూవీ ఛత్రపతి రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీ ఎప్పుడో ఎనౌన్స్ అయిన ఏవో కారణాలతో ఆగుతూ వస్తుంది.స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది.

భారీ బడ్జెట్ తో హిందీలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.అయితే బెల్లంకొండ కోసం హీరోయిన్ ఇంకా ఎంపిక కాలేదు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరూ కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన శ్రీనివాస్ తో చేయడానికి ముందుకి రావడం లేదని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే తుఫాన్ దెబ్బకి ఛత్రపతి కోసం ఆరు కోట్లతో వేసిన సెట్ కాస్త ద్వంసం అయ్యింది.

Advertisement

ఈ నేపధ్యంలో ఛత్రపతి రీమేక్ ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.ఇదిలా ఉంటే కొడుకు కోసం బెల్లంకొండ సురేష్ తమిళ్ హిట్ మూవీ కర్ణన్ రీమేక్ హక్కులు కొనుగోలు చేశారు.

ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు.అయితే ఈ రీమేక్ బాద్యతలని బెల్లంకొండ సురేష్ వివి వినాయక్ కి అప్పగించినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో వినాయక్ ఛత్రపతి రీమేక్ ని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేదా కర్ణన్ రీమేక్ స్టార్ట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే బెల్లంకొండ సురేష్ నేరుగా కర్ణన్ మూవీని భారీ బడ్జెట్ తో రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు