ఎప్పటి నుంచో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ గా మారాలని బిజెపి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది.అయినా ఆ ఆశ ఫలించలేదు.
ఎప్పుడూ మూడో స్థానానికి బీజేపీ పరిమితమైపోతూ వస్తోంది.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, వారు ఇచ్చే అరకొర సీట్లలోనే పోటీ చేస్తూ , బిజెపి నెట్టుకొస్తోంది.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ పరిణామాలు ఏమాత్రం రుచించడం లేదు.ఏదో రకంగా తెలంగాణ ఆంధ్రలో బలపడాలని అధికార పార్టీ గా మారాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండడంతో మొదట్లో బీజేపీని వీరు పరుగులు పెట్టించారు.పార్టీలో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.
తెలంగాణలో బిజెపి బాగానే బలం పుంజుకుంది.దుబ్బాక ఎమ్మెల్యే స్థానంతో పాటు జీహెచ్ఎంసీలో కార్పొరేషన్ స్థానాలను బిజెపి బాగానే గెలుచుకుంది.
ఆ ఉత్సాహంతోనే పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహిస్తూ వస్తున్న సమయంలో ఈటెల రాజేందర్ వ్యవహారం బయటకు రావడం, టిఆర్ఎస్ పై కోపంతో ఆయన బిజెపి వైపు వస్తుండడంతో ఆయనతో పాటు మరికొంతమంది బలమైన నేతలను చేర్చుకునే ప్లాన్ లో బిజెపి ఉంది.తెలంగాణ బిజెపికి మరింత ఉత్సాహం తీసుకువచ్చే విధంగా కొత్త ఇన్చార్జి ని బిజెపి నియమించింది.
ప్రస్తుతం తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసుకునే నేత, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన పార్టీ కార్యదర్శి ప్రకాష్ ను తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని ఆదేశించిందిి.

ఈరోజు ఆయన హైదరాబాదులో బిజెపి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో తెలంగాణ పార్టీీీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ హాజరయ్యారు.
తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు పైన రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహాలు రచించాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించారు.
అలాగే ఏపీ లోనూ ఇదే విధంగా సమావేశాలు నిర్వహించి కొత్త ఉత్సాహం తీసుకురావడంతో పాటు , ఏపీలోనూ పెద్దఎత్తున చేరి కలను ప్రోత్సహించే దిశగా బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది.ఈ వ్యవహారాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలం పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అవసరమైతే ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ను సైతం మార్చేందుకు బిజెపి అధిష్టానం వెనకడుగు వేసేలా కనిపించడం లేదు.