టాలెంటెడ్ హీరోయిన్ డైరెక్షన్ కూడా చేస్తుందట !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో నివేతా థామస్ ఒకరు.

ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టి తర్వాత సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఈ అమ్మడు సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని బిజీ హీరోయిన్ గా మారిపోయింది.తన నటనతో, అందంతో అందరిని తన వైపుకు తిప్పుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.తెలుగులో నాని జంటిల్మెన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయ మయ్యి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిలో పడింది.

తర్వాత కూడా నాని తోనే నిన్నుకోరి సినిమాలో కూడా నటించి ఈ సినిమాతో ఏకంగా ఎన్టీఆర్ సరసన జై లవకుశ సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది.

Advertisement

తన పాత్ర చిన్నదైనా నటన పరంగా బాగుంటే చాలు ఈ అమ్మడు నటించడానికి రెడీ అయిపోతుంది.అందుకు ఈ మధ్యనే రిలీజైన వకీల్ సాబ్ సినిమానే నిదర్శనం.ఈ సినిమాలో కూడా ఈ అమ్మడు నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది.

తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెటించింది.అయితే నివేతా థామస్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది.

ఏమిటంటే ఈ అమ్మడికి డైరెక్షన్ చేయాలనీ ఉందట.ఎప్పటికైనా డైరెక్షన్ వైపు వస్తుందట.అయితే ఇప్పుడు కాదని చెబుతుంది.

ఈ అమ్మడికి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి తనను తాను నిరూపించుకున్న తర్వాత డైరెక్షన్ వైపు వెళుతుందట.సినిమాలు చేస్తూనే గ్యాప్ వచ్చిన సమయంలో డైరెక్షన్ కోర్స్ కూడా కంప్లీట్ చేసిందట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక భవిష్యత్తులో తప్పకుండ డైరెక్టర్ గా కూడా నిరూపించుకోవాలని కోరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు