నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న స్పందన... సెలబ్రిటీలు సైతం...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తున్నదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకి మూడు లక్షల పైగా దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి.

దీంతో పలుచోట్ల ఆక్సిజన్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి మందు కనిపెట్టాడని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా కొంతమంది ఆనందయ్య దగ్గర ఆయుర్వేద చికిత్స తీసుకొని కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు కూడా ఈ విషయంపై స్పందిస్తూ అతి తక్కువ సమయంలోనే తమకు ఉపశమనం కలిగిందని చెబుతున్నారు.దీంతో తాజాగా టాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ రేణు దేశాయ్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెల్లూరు నాటు వైద్యానికి సంబంధించిన వివరాలను షేర్ చేసింది.

అంతేకాక చికిత్స ఏదైనాసరే రోగికి నయం అవడమే ముఖ్యమని కాబట్టి ఒకసారి వివరాలను పరిశీలించి చికిత్సలు తీసుకోవాలని కోరింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

అయితే ఇప్పటికే కొంతమంది నెల్లూరు నాటు వైద్యం తీసుకున్నవారు ఈ విషయంపై స్పందిస్తూ తమకు నిజంగానే నాటు వైద్యం మందు తీసుకున్న తర్వాత ఆక్సిజన్ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని చెబుతున్నారు.మరికొందరు మాత్రం ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో కొట్టుమిట్టాడుతోందని ఇలాంటి సమయంలో అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రాణాల మీదకి తెచ్చిపెడతాయని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి నెల్లూరు నాటు వైద్యం పై సమీక్ష నిర్వ హించాలని కోరుతున్నారు.

దీంతో తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఈరోజు మధ్యాహ్నం ఐసీఎంఆర్ బృందం సభ్యుడు ఆనందయ్య ఆయుర్వేద కేంద్రంపై తనిఖీలు నిర్వహించి అధ్యయనం చేయడానికి నెల్లూరు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు