అక్కినేని కుటుంబం నుండి వచ్చినా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు నాగ చైతన్య.విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు చైతూ.
మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ’ సినిమా స్టార్ట్ చేసాడు.ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమానా విడుదల అవ్వకుండానే నాగ చైతన్య మరొక సినిమాను లైన్లో పెట్టాడు.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ మధ్యనే ఇటలీ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది.తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు నాగ చైతన్య బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా కోసం చైతన్య కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని అందుకోసం మేకోవర్ అవ్వబోతున్నట్టు టాక్.ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుంటే.
చైతన్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.
నాగ చైతన్య ఈ సినిమా కోసం కేవలం 15 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు టాక్.ఇది పూర్తి కాగానే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు.
మొత్తానికి చాలా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు చైతన్య.