ఐపీఎల్‌ అభిమానులకు శుభవార్త..?

కరోనా కారణంగా ఐపిఎల్ వాయిదా పడటం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశచెందారు.దీని వల్ల బీసీసీఐకి కూడా చాలా నష్టం వాటిల్లింది.

అయితే ఎలాగైనా సరే ఈసారి ఐపిఎల్ ను పూర్తిగా మార్చివేయాలని బీసీసీఐ చూస్తోంది.ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఐపిఎల్ ను జరపాలని సన్నాహాలు చేస్తోంది.

ఐపీఎల్‌ 2021లో పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడటంతో మ్యాచులు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత తిరిగి టోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు.

తాజాగా ఈ విషయంపై బీసీసీఐ దృష్టి పెట్టింది.కరోనా బారిన పడ్డ క్రికెటర్ల కొలుకున్న నేపథ్యంలో ఐపీఎల్‌పై ముందుకెళ్లాలని బోర్డు చూస్తోంది.

Advertisement

మిగితా మ్యాచ్‌లు అన్ని ముంబై వేదికగానే జరపాలని చూస్తోంది.ప్రస్తుతం ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఉన్నాయి.

దీంతో ఈ వేదికపై ఎలా ఉంటుందనే అనే దానిపై సన్నాహాలు చేస్తోంది.ఈసారి ఆటగాళ్ళ బస విషయంపై కూడా బోర్డు హోటళ్లతో బీసీసీఐ సంప‍్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

అన్ని స్టేడియాలకు తిప్పుతూ ఆటగాళ్ళను ఇబ్బంది పెట్టే కంటే ముంబైలో ఉన్న మూడు క్రికెట్‌ స్టేడియాల్లో మిగిలిన సీజన్‌ జరపడంపై దృష్టి సారించింది. ముంబైలో బాంబే జింఖానా గ్రౌండ్‌, బ్రబోర్న్‌ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ఉన్నాయి.

దీంతో ఇదే సరైన వేదికగా బీసీసీఐ యోచిస్తోంది.టోర్నీని జూన్‌లో నిర్వహిచేందుకు బీసీసీఐ ప్లాన్ చెస్తోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అప్పటికి కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని బోర్డు భావిస్తుంది.అయితే జూన్‌ 18న భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌతాంప్టన్‌ వేదికగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగాల్సి ఉంది.

Advertisement

దీన్ని వాయిదా వేయాలని ఐసీసీని రిక్వెస్ట్‌ చేసి జూలై నెలకు వాయిదా వేయించాలని చూస్తోంది.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీసీఐ అనుకున్నట్లు జరుగుతుంతో లేదో చూడాలంటే వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు