యాక్షన్ మూవీలో చేయాలని ఉంది అంటున్న ఇలియానా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని అదే సమయంలో బాలీవుడ్ లోకి వెళ్ళిపోయినా అందాల భామ ఇలియానా.

ఈ అమ్మడు తెలుగులో ఉన్న స్టార్ డమ్, క్రేజీ అవకాశాలని ఉన్నపళంగా వదులుకొని ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక యునిక్ క్రియేట్ చేసుకోవడం కోసం బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ మొదటి సినిమానే భిన్నమైన కథతో చేసి హిట్ కొట్టింది.

తరువాత ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ అని అందరూ అనుకున్న ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.సీనియర్ హీరోలైన అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం వచ్చింది.

ఆమె చేసిన సినిమాలలో చాలా వరకు హిట్ అయ్యాయి.అయినా కూడా పెద్ద స్టార్ ఇమేజ్ అయితే ఇలియానాకి రాలేదు.

అయితే కొంత కాలం తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో మునిగి తేలింది.అయితే ఎందుకనో అతనికి బ్రేక్ అప్ చెప్పేసి మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది.

Advertisement

తాజాగా అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్ సినిమాతో అమ్మడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే సినిమాలు తక్కువగా ఉన్న తన ఇన్స్టాగ్రామ్ వాల్ మాత్రం ఇలియానా హాట్ ఫోటోలతో నిండిపోతూ ఉంటుంది.

అయితే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేయలేకపోవడానికి ఇల్లీ బేబీ తాజాగా ఓ స్టొరీ చెప్పుకొచ్చింది.తాను రెగ్యులర్ సినిమాలు చేయలేనని బలమైన కథ, తన పాత్రకి ప్రత్యేకత ఉండే వాటినే ఎంపిక చేసుకుంటూ చేస్తున్నానని చెప్పింది.

ఈ కారణంగా ఇప్పటి వరకు బాలీవుడ్ లో తక్కువ సినిమాలు చేసానని చెప్పింది.అలాగే యాక్షన్ కథాంశంతో తెరకెక్కే సినిమాలో ఫైట్స్ సీక్వెన్స్ లో నటించాలని ఉందని, అలాంటి సినిమా అవకాశం వస్తే అస్సలు వదులుకోనని కూడా ఇలియానా చెప్పడం విశేషం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు