ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసిన సంగతి తెలిసిందే.ఆ వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని భావించినా కరోనా విజ్రుంభించడంతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సందిగ్ధంగా మారింది.
ఎందుకంటే కరోనా విజృంభణతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు.దీంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కర్ఫ్యూ ను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలని పోలీసు శాఖకు కఠినమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఏప్రిల్ 30న కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది.
అయితే ఈ ఎన్నికలను నిర్వహించవద్దని చెప్పి చాలా వరకు నిరసనలను వ్యక్తమవుతున్నాయి.అయితే దీనిపై కొంత మంది హైకోర్టుకు సైతం వెళ్లినా ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకొనే అధికారం కోర్టు లేదని చెప్పింది.
ఇక ఈ నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం మాత్రమేనని, ఆ అధికారం వారికి మాత్రమే ఉందని వ్యాఖ్యానించింది.ఏది ఏమైనా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.
అయితే ఈ విషయంపై ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ స్పందించని పరిస్థితులలో ఎన్నికలను యధావిధిగా నిర్వహించే అవకాశాలు కల్పిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఇప్పటికే గుంపులుగా తిరగవద్దని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజల సమూహం లేనిది ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.