గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. సొంత పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయాలపై సెటైర్లు వేస్తూ, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాల్సింది గా వైసీపీ అధిష్టానం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది .ఈ క్రమంలోనే తనపై అనర్హత వేటు వేయించుకోవాలని , అలా అనర్హత వేయించలేకపోతే తానే పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు .ఈ విధంగా ఆయన ఫిబ్రవరి 5 తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు.అయితే అది అమల్లోకి రాలేదు. ఆయన బిజెపి లో చేరి ఆ పార్టీ నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయాలని చూస్తున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల జనసేన టిడిపి మద్దతు తనకు లభిస్తుందని, సునాయాసంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.అయితే బిజెపి మాత్రం రఘురామ ను పార్టీలో చేర్చుకునే విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు.ఎందుకంటే దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ ఆధ్వర్యంలో బలమైన కూటమి తెరపైకి వస్తోంది.అలాగే బీజేపీ పై ప్రజావ్యతిరేకత బాగా పెరిగింది అనే విషయం వివిధ సర్వేల్లోనూ, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ అర్థమైంది.
దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయం బిజెపి పెద్దల్లో ఉంది.అదే జరిగితే తప్పకుండా వైసీపీ ఎంపీల మద్దతు తమకు అవసరం అవుతుందని , బీజేపీ హైకమాండ్ అంచనా వేస్తోంది.
ఇప్పుడు రఘు రామ ను పార్టీలో చేర్చుకోవడం వల్ల వైసీపీ ని దూరం చేసుకోవాల్సి వస్తుందని , ఆయన ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనేది ఢిల్లీ రాజకీయ వర్గాల టాక్.