జగన్ ప్రభుత్వం పై సీరియస్ అయిన పవన్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుండి నేడు కోలుకోవటం తెలిసిందే.ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల విషయంలో జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు.చాలా రాష్ట్రాలలో పదవ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం జరిగింది.

కేంద్రం కూడా సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసుకోవడం జరిగింది.అయితే జగన్ ప్రభుత్వం మాత్రం .పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి రాష్ట్ర ప్రజలు భయాందోళన లో ఉంటే .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరిస్తోంది అని విమర్శించారు.అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రోజు కరోనా కేసులు వేలాది సంఖ్యలో నమోదు అవుతుంటే.ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పరీక్షలు నిర్వహించటం వల్ల వైరస్ మరింత విజృంభించడం గ్యారెంటీ అని ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించారు.

Advertisement

పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సమర్థించుకున్న తీరు హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.రాష్ట్రంలో 16 లక్షల మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఉన్నారనీ వీరు కరోనా బారిన పడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

పదవ తరగతి పరీక్షలు నిర్వహించకపోతే ఆర్మీ ఉద్యోగాలు నష్టపోతారని అనడం అర్దరహితమన్నారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

పరీక్షల నిర్వహణ విషయంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని మాదిరిగా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా సాక్షిగా లెటర్ ద్వారా పవన్ కోరారు.  .

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు