నయా ట్రెండ్: బతికున్న పురుగులను పెట్టి పెన్నులను అమ్ముతున్న వ్యాపారులు..! ఎక్కడంటే..?!

మార్కెటింగ్ లో నెంబర్ వన్ గా నిలవాలంటే ప్రజలను ఆకర్షించగల క్రియేటివిటీ హై లెవెల్ లో ఉండాలి.

ఒకే ఒక్క క్రియేటివ్ ఐడియా బిజినెస్ ని లాభాల బాట పట్టిస్తుంది.

ప్రస్తుతం జపనీయులు కూడా ఓ తెలివైన ఆలోచనతో పెన్నుల బిజినెస్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.ఎవరికీ రాని ఆలోచన చేసిన జపనీయులు నెమటోడ్ అనే పరాన్నజీవులను విద్యార్థులు రాసుకునే పెన్నుల్లో పెట్టి విక్రయించడం ప్రారంభించారు.

ఈ పెన్నుల్లో వెనుకభాగం అమర్చిన ఒక చిన్న వాటర్ ట్యాంక్ లో బతికున్న నెమటోడ్ పరాన్న జీవులు అటు ఇటు తిరుగుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుండటంతో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే ఈ మోడల్ పెన్నులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎగబడుతున్నారు అని కూడా తెలుస్తోంది.

నిజానికి ఈ పరాన్న జీవులు పచ్చి మాంసం, చేపలు తిన్న మనుషుల శరీరంలోకి చేరి మనుషులతోనే పెరుగుతుంటాయి.వీటివల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

Advertisement

ఐతే ఇలాంటి పరాన్న జీవులు శరీరం బయట.అది కూడా మన రాసుకునే పెన్నులలో పెట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.అయితే తయారీదారులు ఒక్కో పెన్ను లో 4 నుంచి 5 వరకు తెల్లగా ఉండే ఈ పరాన్న జీవులను ఉంచుతున్నారు.

జేబులో పెన్ను కొనుగోలు చేసిన తర్వాత ఐదారు రోజుల వరకు బతికే ఉంటాయి.అయితే బతికున్నంత కాలం అవి చాలా చురుకుగా నీటిలో తిరుగుతుంటాయి.ఈ ప్రత్యేకమైన పెన్నులను ఆప్తుల కోసం చాలామంది కొనుగోలు చేస్తున్నారు.

ఈ పెన్నుల లోపల పరాన్నజీవులు కదలికలు చాలా అందంగా ఉండటం తో వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.అయితే చాలా వింతగా ఉన్న ఈ పెన్నులకు సంబంధించిన వీడియోలు అంతర్జాలం లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మీరు కూడా ఒక లుక్కేయండి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు