'జాతిరత్నాలు' సినిమాకు బ్యాడ్‌ టాక్‌.. వారికి నచ్చలేదట!

చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న జాతి రత్నాలు సినిమా ఏకంగా 35 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా చెబుతున్నారు.

జాతి రత్నాలు కరోనా పరిస్థితుల్లో కూడా అంతగా వసూళ్లు సాధించింది అంటే ఏ రేంజ్‌ లో సినిమా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.

అయిదు కోట్లకు అటు ఇటు బడ్జెట్ తో రూపొందిన జాతి రత్నాలు భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌ వారు ఈ సినిమా ను పెద్ద మొత్తంకు కొనుగోలు చేయడం జరిగింది.జాతి రత్నాలు సినిమా రెండు రోజుల క్రితం స్ట్రీమింగ్‌ మొదలు అయ్యింది.

అమెజాన్‌ లో ఈ సినిమా కు అనూహ్యమైన స్పందన వస్తుందని అంతా ఊహించారు.సినిమా కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

కాని అనూహ్యంగా సినిమా కు ఓటీటీ ప్రేక్షకుల నుండి నెగటివ్‌ టాక్ వ్యాప్తి చెందుతోంది.జాతిరత్నాలు సినిమా ను ఓటీటీ లో చూసిన వారు ఇదేం సినిమా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఎందుకు ఈ సినిమా ను థియేటర్ ప్రేక్షకులు అంత పెద్ద సక్సెస్‌ చేశారు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఓటీటీ లో సినిమా ను చూడాలనుకున్న వారు వెంటనే చూశారు.

కాని వారి ఆశలు అన్ని కూడా నిరాశ అయినట్లుగా సినిమా ఫలితం ఉందట.సినిమా ను థియేటర్‌ లో అయితేనే ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఒకొక్కరు కూర్చుని చూస్తూ ఎంజాయ్‌ చేసే సినిమా కాదు.కనుక జాతి రత్నాలు సినిమా ను ఓటీటీ లో అయినా కూడా టీమ్‌ గా చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఓటీటీ సినిమా లను తక్కువ సౌండ్‌ తో చూడటం వల్ల కూడా కాస్త నిరాశ పర్చే అవకాశం ఉంది.కనుక సినిమా ఎవరికి అయితే నచ్చలేదో వారు వెళ్లి స్నేహితులతో కలిసి మళ్లీ చూడండి అప్పుడు ఖచ్చితంగా జాతి ర్నాలు నచ్చుతుందంటున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు