న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎల్బి స్టేడియం లో కోచ్ ల ఆందోళన

ఎల్బి స్టేడియం స్లాట్స్ కార్యాలయం వద్ద కోచ్ లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

స్లాట్స్ ఒప్పంద కోచ్ ల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

2.తెలంగాణలో సంకల్ప సభ నిర్వహిస్తాం : షర్మిల పార్టీ

తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖమ్మంలో సంకల్ప యాత్ర నిర్వహించి తీరుతామని షర్మిల పార్టీ ప్రతినిధి కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు.

3.బాలికను వేధిస్తున్న యువకుడు : పొక్సో కేసు

బాలికను వేధిస్తున్న యువకుడు పై పోక్సో కేసు నమోదు అయ్యింది.సుచిత్ర సెంటర్ కు చెందిన బాలికను సంగారెడ్డి, జిన్నారం కు చెందిన రాహుల్ అనే యువకుడు వేధిస్తుండడం తో అతనిపై ఈ కేసు నమోదు అయ్యింది.

4.రేపు ప్రింట్ మీడియా కు ఉగాది పురస్కారాలు

తెలుగు భాషా సంస్కృతి శాఖ, శ్రుతి లయ ఆర్ట్స్ అకాడమీ , సీల్ వెల్ కార్పొరేషన్ , కోవిధా పౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన రవీంద్రభారతిలో ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు అందించనున్నట్టు ఆయా సంస్థల నిర్వాహకులు తెలిపారు.

5.లాక్ డౌన్ వద్దు అనుకుంటే మాస్క్ లు ధరించాలి : కేటీఆర్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, మరోసారి తెలంగాణలో లాక్ డౌన్ విధించకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ఉపయోగించాలని స్పష్టం చేశారు.

6.షర్మిల గూటికి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు

మహిళా కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు అచ్చుతా యాదవ్ పార్టీ పదవికి రాజీనామా చేశారు.అనంతరం ఆమె వైఎస్ షర్మిలను కలిశారు.షర్మిల పార్టీ పేరు ప్రకటించిన అనంతరం ఆమె పార్టీలో చేరే అవకాశం ఉంది.

7.ఐదో రోజుకు చేరుకున్న స్టీల్పట్ దీక్షదీక్ష లు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు నేటికి ఐదో రోజుకు చేరుకున్నాయి.

8.జగన్ బెయిల్ రద్దుకు వైసీపీ ఎంపీ పిటిషన్

సిబిఐ కోర్టులో ఏ 1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హై కోర్టు లో పిటిషన్ వేశారు.

9.కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మహిళ మృతి

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 61 సంవత్సరాల మహిళ మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కరప శివారు రామకంచిరాజు నగర్ కాలనీలో చోటు చేసుకుంది.15 రోజుల కిందటే ఆమె కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె కరోనా వాక్సిన్ తీసుకున్నారు.

10.ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం రేపింది.ఇక్కడ ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగతా పదిహేను మంది విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించారు .

11.బంగ్లా లో పడవ ప్రమాదం

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.షితలాక్య నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకోగా 27 మంది మృతి చెందారు.

12.26 నుంచి టిసిసి పరీక్షలు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు  టి సి సి పరీక్షలు ఈ నెల 7 నుంచి 10 వరకు జరగాల్సి ఉండగా, వాటిని వాయిదా వేసి ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

13.గుండె పోటు తో రాజధాని రైతు మృతి

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం తుళ్లూరు మండలం వెంకటపాలేనికి చెందిన మిట్టసల సుందర్ సింగ్ (51) అనే రైతు రాజధానిపై బెంగతో గుండె పోటుతో మృతి చెందారు.

14.ఉక్కు పరిరక్షణకు 10 లక్షల సంతకాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పది లక్షల సంతకాల సేకరణ కు శ్రీకారం చుట్టాయి.

15.ప్రవేటికరణ ఆలోచన కాంగ్రెస్ దే : సోము వీర్రాజు

Advertisement

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం అనే ఆలోచన కాంగ్రెస్ దే అని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

16.ఢిల్లీ లో నైట్ కర్ఫ్యూ

దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి సమయాల్లో  కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ గా ఉండడం, ఢిల్లీలో పెద్దఎత్తున కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది.

17.24 గంటల్లో 43 లక్షల మందికి టీకాలు

వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం నిర్ణయాలు తీసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 43 లక్షల మందికి కరోనా టీకాలు అందించారు.

18.రేపు పరీక్షా పే చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ ఏటా విద్యార్థులతో నిర్వహించే పరీక్షా పే కార్యక్రమం బుధవారం జరగనుంది.

19.ఓటర్ల జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు

ఓటర్ల జాబితా నుంచి జయలలిత సన్నిహితురాలు శశికళ పేరు తొలగించారు అనే సమాచారం ఇప్పుడు తమిళనాడులో వైరల్ అవుతోంది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,200 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,200.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు