ఆ ఆకలి లేకపోతే కష్టమంటున్న అజయ్..?

తెలుగులో చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు అజయ్.

విక్రమార్కుడు, బృందావనం, ఇష్క్, అల వైకుంఠపురములో, దిక్కులు చూడకు రామయ్య సినిమాల్లోని పాత్రలు అజయ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

దాదాపు 20 సంవత్సరాల క్రితం నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అజయ్ కు సంవత్సరం సంవత్సరానికి సినిమా ఆఫర్లు పెరుగుతూనే ఉన్నాయి.విక్రమార్కుడు సినిమాలో క్రూరమైన విలన్ టిట్లా పాత్రలో అజయ్ విలనిజం అద్భుతంగా పండించారు.

కొన్నేళ్ల క్రితం వరకు నెగిటివ్ రోల్స్ లోనే ఎక్కువగా నటించిన అజయ్ ప్రస్తుతం పాజిటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు.హిట్ ఫ్లాపులకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

విక్రమార్కుడు లాంటి విలన్ రోల్స్ చాలా రేర్ గా దొరుకుతాయని అజయ్ అన్నారు.విక్రమార్కుడు సినిమా తరువాత విలన్ రోల్స్ తనకు వచ్చినా టిట్లా పాత్రతో పోల్చి చూస్తే చిన్నగా కనిపించేవని అజయ్ అన్నారు.

Advertisement

ప్రస్తుతం అన్ని రకాల పాత్రల్లో తాను నటిస్తున్నానని అజయ్ తెలిపారు.కొన్నిసార్లు స్టోరీ నచ్చకపోయినా తాను సినిమాలో నటించిన సందర్భాలు ఉన్నాయని అజయ్ అన్నారు.అయితే ఇప్పుడు మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలనే తాను ఎంచుకుంటున్నానని అజయ్ పేర్కొన్నారు.20 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తూ ఉండటంతో ఆర్థికపరమైన సంతృప్తి లభించినా యాక్టర్ గా మంచి పాత్రలలో నటించాలని ఉందని.మంచి పాత్రలు ఎంచుకోవాలనే కోరిక లేకపోతే కెరీర్ ఎగ్జైటింగ్ గా ఉండదని అజయ్ అన్నారు.

కొన్ని పాత్రలకు మాత్రమే తాను రిహార్సల్స్ చేస్తానని తనకు వెబ్ సిరీస్ లలో కూడా ఆఫర్లు వస్తున్నాయని అజయ్ తెలిపారు. చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప సినిమాలలో తాను నటిస్తున్నానని అజయ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు