టీటీడీ కి గుడ్ న్యూస్ చెప్పిన జమ్మూ ప్రభుత్వం..!!

జమ్మూ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్థలం కేటాయిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.25 హెక్టార్ల భూమిని టీటీడీ కేటాయించినట్లు అప్పటి సర్కార్ స్పష్టం చేసింది.

దేశంలో వెంకటేశ్వర స్వామికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రధాన నగరాలలో ఆలయాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో లేనిచోట ఆలయాలు నిర్మించాలని టీటీడీ గత కొంత కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఉంది.అందులో భాగంగానే ఈ మధ్యనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ లో ఆలయం నిర్మించాలని దేవస్థానం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దీంతో వెంటనే రాష్ట్రంలో స్థలం కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ కి లెటర్ రాయడం జరిగింది.ఆ వెంటనే గవర్నర్ లెటర్ పరిశీలించి.25 హెక్టార్ల స్థలం కేటాయించడానికి జమ్ము ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టీటీడీ కి 40 ఏళ్లపాటు లీజ్ ప్రాతిపదికన స్థలం కేటాయించడం జరిగింది.

టీటీడీ కేటాయించిన స్థలంలో వేదపాఠశాల, ధ్యాన కేంద్రం, కార్యాలయాలు, యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి.నివాసగృహాలు, పార్కింగ్ సదుపాయం ఉండేవిధంగా చాలా కేటాయింపు జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

తాజా వార్తలు