కరోనా టైంలో కూడా వందల కోట్లు గడించిన సెలబ్రిటీగా నిలిచిన కోహ్లీ

గత ఏడాది కరోనా కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా చాలా వ్యాపారాలు తాత్కాలికంగా మూతపడ్డాయి.అలాగే ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోయింది.

కోట్లాది ఉద్యోగులు తమ ఉద్యోగ, ఉపాధి మార్గాలు కోల్పోయారు.బ్రతుకుతెరువు కోసం చాలా మంది సొంతఊళ్ళకి తిరిగి వెళ్ళిపోయారు.

లక్షల కోట్ల రూపాయిలలో కంపెనీలు కూడా నష్టపోయాయి.కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి, క్రికెట్ మ్యాచ్ లు ఆగిపోయాయి.

ఇలా అన్ని కూడా బంద్ కావడంతో సెలబ్రిటీలు కూడా వారికి రావాల్సిన ఆదాయం కొంత వరకు గత ఏడాది కోల్పోవాల్సి వచ్చింది.అయితే ఇలాంటి లాక్ డౌన్ సమయంలో కూడా కొంత మంది ఇండియన్ సెలబ్రిటీలు భారీగానే ఆదాయాన్ని ఆర్జించారు.ఈ గణాంకాలని తాజాగా డఫ్ & ఫెల్ఫ్స్ అనే సంస్థ ప్రకటించింది.2020 సంవత్సరానికి గానూ ఇండియాలో మోస్ట్ బ్రాండ్ వ్యాల్యూ కలిగిన సెలబ్రిటీస్ జాబితా రిలీజ్ చేసింది.అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇండియన్ సెలబ్రేటీల జాబితాలో టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా నాలుగో సంవత్సరంలో కూడా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తూ మొదటి స్థానిలో నిలిచాడు.కరోనా కండీషన్స్ లో కూడా 237.7 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం కలిగిన ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు సృష్టించాడు.విరాట్ మార్కెట్ లో చాలా ప్రోడక్ట్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వలన ఈ ఆదాయాన్ని సంపాదించగలిగాడు.తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు.118 మిలియన్ డాలర్లతో ఆయన రెండో స్థానం సాధించారు.మూడో స్థానంలో ఫ్యాషన్ రారాజు రణ్ వీర్ సింగ్ నిలిచారు.ఆయన బ్రాండ్ విలువ 102.9 మిలియన్ డాలర్లుగా జాబితా అనౌన్స్ చేసింది.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు