చరణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మహిళా అభిమాని.. ఏమిటంటే..?

రేపు స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చరణ్ అభిమానులలో కొంతమంది చరణ్ కొరకు ప్రత్యేకమైన బహుమతులను తయారు చేసి పంపుతున్నారు.

చరణ్ ను అమితంగా అభిమానించే అభిమానులలో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న బొడ్డు శ్రీమతి ఒకరు.చరణ్ నటించిన ఏ సినిమా విడుదలైనా ఆమె తప్పకుండా చూసేవారు.

చరణ్ పుట్టినరోజు కావడంతో బొడ్డు శ్రీమతి అందమైన బహుమతిని తయారు చేశారు.చరణ్ కోసం ఆమె కొబ్బరి చీపురు పుల్లలతో అందమైన ఇల్లును తయారు చేశారు.

చరణ్ కోసం తయారు చేసిన అందమైన ఇల్లును కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బొడ్డు శ్రీమతి రామ్ చరణ్ ను ట్యాగ్ చేయగా విషయం తెలిసిన రామ్ చరణ్ అభిమానిని కలవడంతో పాటు అభిమాని ఇచ్చిన గిఫ్ట్ ను చూసి ఉప్పొంగిపోయారు.

Advertisement

అభిమాని చరణ్ కు ఇచ్చిన బహుమతికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రముఖ నిర్మాతలలో ఒకరైన బీఏ రాజు సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేశారు.అభిమాని అభిమానానికి రామ్ చరణ్ ముగ్దుడవగా చరణ్ స్వయంగా కలవడంతో బొడ్డు శ్రీమతి, ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరోవైపు రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.కేవలం ఐదు నెలల గ్యాప్ లో రామ్ చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఈ ఏడాదే స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా మొదలు కానుండగా వచ్చే ఏడాది ఆ సినిమా విడుదల కానుందని సమాచారం.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు