జాతిరత్నాలు హీరోకు అదిరిపోయే ఆఫర్..!

టాలీవుడ్‌లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తనకంటూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

కాగా ఆయన నటించిన తాజా చిత్రం ‘జాతి రత్నాలు’ టాలీవుడ్‌లో ప్రస్తుతం పిచ్చ బజ్‌ను క్రియేట్ చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇక ఈ సినిమాకు ప్రభాస్ కూడా ప్రమోషన్స్ అందిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇదిలా ఉండగానే హీరో నవీన్ పోలిశెట్టి ఓ అదిరిపోయే ఆఫర్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించబోయే ఓ సినిమాలో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది.

అంతేగాక ఈ సినిమాలో ఏకంగా అనుష్కతో రొమాన్స్ కూడా చేయనున్నాడట ఈ హీరో.రమేష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు అనుష్క ఓకే చెప్పగా, ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టిని తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Advertisement

ఇక ఈ అవకాశం తనకు రావడంతో నవీన్ పోలిశెట్టి ఎగిరి గంతేసినట్లు తెలుస్తోంది.మొత్తానికి జాతిరత్నాలు చిత్రంతో మరో అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్న నవీన్ పోలిశెట్టికి అనుష్క సరసన నటించే ఛాన్స్ రావడంతో ఆయనకు ఇది చక్కటి అవకాశం అని ఆయన అభిమానులు అంటున్నారు.

మరి నవీన్ పోలిశెట్టి నటిస్తున్న జాతిరత్నాలు చిత్రం ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఈ సినిమా తరువాత అనుష్కతో ఆయన చేయబోయే సినిమా ఎలా ఉంటుందో కూడా చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏదేమైనా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు ఈ జాతిరత్నాలు హీరో.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు