బాబా సచ్చరిత్ర పారాయణం చేస్తున్నారా... ఈ నియమాలు తప్పనిసరి..!

షిరిడి సాయిబాబా మహిమల గురించి అందరికీ తెలిసిందే.ఏవైనా కష్టాలలో ఉన్నప్పుడు సాయి అని పిలిస్తే చాలు కష్టాల కడలి నుంచి మనల్ని గట్టేక్కిస్తాడు.

సాయి సమాధి వద్దకు వెళ్లి ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.అయితే బాబా మహిమలు, రచనలను అన్నింటిలోకి సాయి సచ్చరిత్ర ఎంతో గొప్పది.

సాయి సచ్చరిత్ర పారాయణ చదువుతున్నారంటే బాబా చెప్పిన ఉపదేశాలు, నీతులు, ఈ సచ్చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు.ఎంతో పవిత్రమైన ఈ సచ్చరిత్రను చదివేటప్పుడు ఎలా పడితే అలా చదవకుండా కొన్ని నియమ నిష్టలు పాటించాలి.

ఎలాంటి కష్టాలలో ఉన్న వారైనా భక్తి శ్రద్ధలతో తనని పూజిస్తే తప్పకుండా వారి కష్టాలు నెరవేరుస్తానని స్వయంగా బాబా తెలియజేశారు.అయితే సాయి సచ్చరిత్రను చదివేటప్పుడు ఏలాంటి నియమాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Advertisement

సాయి సచ్చరిత్ర చదవడానికి ప్రారంభించిన రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం చేసి సచ్చరిత్రను చదవడం ప్రారంభించాలి.సాయి పారాయణం చదివేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు.

అదేవిధంగా మనకు ఆటంకం కలిగించే వస్తువులైన సెల్ ఫోన్ వంటి వాటిని దగ్గర ఉంచుకోకూడదు.సాయి సచ్చరిత్రను పారాయణం చేయడానికి కులమత బేధాలు లేవు.

కులం మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సాయి సచ్చరిత్రము పారాయణం చేయవచ్చు.

సాయి సచ్చరిత్ర ను ఒక రోజే కాకుండా 7 రోజులు కొంత సమయం పాటు పారాయణం చదవాలి.అయితే సాయి సచ్చరిత్ర పారాయణ చదివేటప్పుడు ఉదయం చదవాలి.ఏదైనా సంకల్పంతో పారాయణం చేస్తున్న సమయంలో వారి పేరును తలచుకుని వారి పేరిట పారాయణం చేయడం ద్వారా వారికి ఉన్న కష్టాలు సైతం తొలగిపోతాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

గురుపౌర్ణమి, విజయదశమి, శ్రీరామనవమి, దత్త జయంతి వంటి రోజులు బాబాకు ఎంతో ఇష్టమైనవి.ఈ రోజులలో పారాయణం చేయటం వల్ల బాబా అనుగ్రహాన్ని పొందవచ్చు.పారాయణం చదివేముందు బాబాకు నైవేద్యం సమర్పించి మనలో ఉన్న అహంకారం పక్కనపెట్టి బాబా పారాయణం చేయాలి.

Advertisement

ఈ విధంగా సచ్చరిత్రను చదివేటప్పుడు ఈ నియమాలు పాటించడం ద్వారా బాబా అనుగ్రహం పొంది కష్టాల నుంచి బయట పడవచ్చు.

తాజా వార్తలు