ప‌రీక్ష‌ల టైమ్‌లో పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే!

ప్ర‌స్తుతం పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌ల హ‌డావుడి మైద‌లైంది.ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు విద్యా సంస్థ‌లు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

మ‌రోవైపు ప‌రీక్ష‌ల‌న‌గానే భ‌య‌ప‌డుతుంటారు పిల్ల‌లు.

ఈ క్ర‌మంలోనే ఏం చ‌ద‌వాలి.? ప‌రీక్ష‌ల్లో ఏం వ‌స్తాయి.? చ‌దివిన‌వి గుర్తుంటాయా.? అంటూ కాస్త‌ ఒత్తిడి గురవుతుంటారు.అయితే ప‌రీక్ష‌ల స‌మ‌యంలో పిల్ల‌లే కాదు.

వారి త‌ల్లిదండ్రులు కూడా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా పిల్ల‌ల డైట్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

Advertisement

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో పిల్ల‌ల డైట్‌లో కొన్ని ఆహారాల‌ను చేర్చాలి.అవేంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ప‌రీక్ష‌ల స‌మ‌యంలో కొంద‌రు పిల్లలు ఎంత చ‌దివినా మ‌ర‌చిపోతుంటారు.అందువ‌ల్ల‌, చ‌దివింది బాగా గుర్తుండాల‌న్నా, బ్రెయిన్ షార్ప్‌గా ప‌ని చేయాల‌న్నా.

పిల్ల‌లు డైట్‌లో ఖ‌చ్చితంగా న‌ట్స్ ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా బాదం, కిస్ మిస్‌, వాల్ న‌ట్స్‌, జీడి ప‌ప్పు వంటివి పెట్టాలి.

యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు పెట్టాలి.ఎందుకంటే, ఇవి పిల్ల‌ల్లో ఉండే ఒత్తిడిని, టెన్ష‌న్‌ను దూరం చేస్తాయి.అలాగే ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ప్ర‌తి రోజు పిల్ల‌ల‌కు గుడ్డు, పాలు ఖ‌చ్చితంగా ఇవ్వాలి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఆకు కూరలు కూడా వారి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.ఆకు కూర‌ల్లో ఉండే పోష‌కాలు పిల్ల‌ల మెద‌డు ప‌ని తీరును మెరుగు ప‌రుస్తుంది.

Advertisement

రాత్రి ఎక్కువ సేపు మేలుకుని చదవడం కోసం పిల్ల‌లు కాఫీ, టీ తాగుతూ ఉంటారు.కానీ, ఇలా చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదు.

కాఫీ, టీల‌కు బ‌దులుగా కొబ్బ‌రి నీరు, ఫ్రూట్ జ్యూస్‌లు సేవించ‌డం మంచిది.అలాగే మజ్జిగ, లస్సీ, వెన్నతీసిన పెరుగు, బీట్‌రూట్, క్యారెట్, ఉసిరికాయ, స్ట్రాబెర్రీ వంటివి పిల్ల‌ల డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.

ఇక ప‌రీక్ష‌లు అయ్యే వరకూ ఫాస్ట్ ఫుడ్స్‌, స్పైసీ ఫుడ్స్‌, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ అస్స‌లు పెట్ట‌కూడ‌దు.

తాజా వార్తలు