బీజేపీ యువ ఎంపీకి చేదు అనుభవం.. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ?

రాజకీయాల్లో పదవి దక్కించుకోవడానికి ఎన్ని హమీలు అయినా ఇస్తారు, ఓటర్ల మనసులో ఆశలు పుట్టిస్తారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలకు అంతే ఉండదు.

పాపం పిచ్చి జనం గెలిచాక వారేదో చేస్తారని ఆశించి ఓట్లు వేస్తారు.

తర్వాత భంగపడతారు.అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ఎన్నికల్లో గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా ఈరోజు నిజామాబాద్ జిల్లా చౌటుపల్లిలో జరుగుతున్న ఓ సమావేశానికి హాజరైన అరవింద్ ను పసుపు రైతులు నిలదీశారట.అంతే కాకుండా హమీ ఇచ్చిన వీడియోలను చూపిస్తూ, ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారట.

అంతకు ముందు కూడా, బాల్కొండ పసుపు రైతులు అరవింద్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారట.ఇక పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ఉపయోగకరమైనదని అరవింద్ తెలియచేస్తున్నా ఆయన మాట వినని రైతులు ఇప్పుడున్న పదవికి రాజీనామా చేసి అదే మాటతో తిరిగి ఎన్నికల్లో గెలచి చూపించాలని రైతులు స్పష్టం చేస్తున్నారట.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు