'ఆహా' మరో స్టెప్‌ వేసింది.. అల్లు ప్లానింగ్‌ అదరహో అనాల్సిందే

అల్లు అరవింద్‌ సారథ్యంలో ప్రారంభం అయిన ఆహా ఓటీటీ ఇప్పటి వరకు చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు చిన్న చిన్న వెబ్‌ సిరీస్ లను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

మొదటి సారి పెద్ద సినిమాల విషయంలో చర్చలు జరుపుతోంది.

ఇప్పటి వరకు కోటి కి కాస్త అటు ఇటుగా సినిమాలను మాత్రమే తీసుకున్న ఆహా వారు ఇకపై పెద్ద సినిమా లపై దృష్టి పెట్టేందుకు సిద్దం అయ్యింది.పెద్ద సినిమాలు కొత్త సినిమాలు అంటే అమెజాన్ మరియు జీ5 ఇంకా ఇతర ప్రముఖ ఓటీటీలు మాత్రమే ముందుకు వస్తున్నాయి.

కాని ఈసారి మాత్రం ఆహా కూడా సై అంటోంది.చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను కూడా దక్కించుకునేందుకు సిద్దం అన్నట్లుగా ఆహా వారు ఉన్నారు.

అల్లు అరవింద్ ప్రస్తుతం పెద్ద సినిమాలను దక్కించుకునే పనిలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల సక్సెస్ అయిన క్రాక్‌ సినిమాను మరియు త్వరలో విడుదల కాబోతున్న లవ్‌ స్టోరీ సినిమాలను ఆహా వారు దక్కించుకున్నారు.

Advertisement

క్రాక్‌ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల్లో ఉన్న సమయంలో అల్లు అరవింద్‌ ఓటీటీ రైట్స్‌ ను కొనుగోలు చేశాడు.వాటితోనే సినిమాను విడుదల చేసేందుకు ఠాగూర్‌ మధు క్లియరెన్స్ సర్టిఫికెట్‌ ను దక్కించుకున్నాడు.

కనుక ఆహా కు క్రాక్‌ దక్కింది.ఇక లవ్‌ స్టోరీ సినిమాను కూడా ఆహా ఓటీటీకి ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు.

ఇవి మాత్రమే కాకుండా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆహా దక్కించుకోబోతుంది.భారీ సినిమాలను అమెజాన్‌ తో పోటీ పడి మరీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దాంతో ఇక అల్లు వారి ఆహా కు అందరు అదరహో అనాల్సిందే.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు