వైరల్ వీడియో: నాగుల చవితి పూజల నేపథ్యంలో పుట్టలోని గుడ్లను తిన్న పాము..!

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హిందువులు నాగులచవితి చాలా ఘనంగా జరుపుకుంటారు.తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నాగులచవితిని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఉదయాన్నే ఇంట్లో పూజలు చేసుకుని ఆ తర్వాత పాము పుట్ట దగ్గర పాలు పోయడానికి వెళ్లి వారి మొక్కులను తీర్చుకున్నారు.పుట్టలో పాలు పోసి, పామకు గుడ్లు పెట్టడం ఎప్పటినుంచో ఆనవాయితిగా వస్తుంది.

తాజాగా రెండు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భక్తులకుతో నాగ దేవాలయాలు కిటకిటలాడాయి.ఇదిలా ఉండగా నాగుల చవితి నాడు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో నాగుల చవితి రోజున చూడదగ్గ సన్నివేశం కనబడింది.

Advertisement

జిల్లాలోని కొల్లూరు మండలం తాళ్లూరు వద్ద మహిళలు పూజలు చేస్తున్న సమయంలో పుట్ట లోపలికి పాలు పోయడంతో పాటు కోడిగుడ్లు కూడా వారు వేశారు.అలా భక్తులు అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చేశాక ఆ పుట్టలో ఉన్న ఓ నాగుపాము బయటికి వచ్చి భక్తులు సమర్పించిన గుడ్డును ఆరగించడం మొదలుపెట్టింది.

అలా గుడ్డును పాము తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాక్షాత్తు నాగదేవత వచ్చిందని పాముకు మహిళలు చేతులెత్తి నమస్కారం చేశారు.

అయితే మనం చాలా మంది పుట్టలో పాలు పోయవద్దని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు చెబుతూనే ఉంటారు.అయితే వాస్తవానికి పాము పాలు తాగితే పాముకి అవి అరగవని పుట్టలో పాలు పోసి వాటిని ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తుంటారు.

ఆయన గాని మన మహిళలు మాత్రం మాట వింటారా చెప్పండి.వారి భక్తి కోసం పుట్టలో పాలు పోసి గుడ్లను కూడా పాములకు అందిస్తూ ఉంటారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఏది ఏమైనా నాగుల చవితి నాడు పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి కోడిగుడ్డును ఆస్వాదించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు