ఏంటీ... వకీల్ సాబ్ ని కూడా అందులోనే రిలీజ్ చేస్తున్నారా..?

తెలుగులో టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "వకీల్ సాబ్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే  ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరియు ఇతరులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా దాదాపుగా మూడు సంవత్సరాల కాలం గ్యాప్ తర్వాత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ చిత్ర విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా విపత్కర పరిస్థితులలో థియేటర్లను తాత్కాలికంగా మూసివేయడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారులు దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ చిత్రాన్ని కొనడానికి ముందుకు వచ్చినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం థియేటర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా, ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న "విరూపాక్ష" అనే చిత్రంలో  నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేగాక ఈ చిత్ర షూటింగ్ పనుల్లో కేవలం 25 రోజులు మాత్రమే పాల్గొంటానని షరతు పెట్టినట్లు సమాచారం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు