శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి: అన్ని వదిలేసి వచ్చి.. మాతృదేశ సేవలో...!!

సాధారణంగా భారతదేశంలో ఉన్నత చదువులు చదువుకున్నవారి తదుపరి టార్గెట్ విదేశాల్లో ఉద్యోగం.అక్కడ నాలుగు రాళ్లు సంపాదించి, ఆ దేశాల్లోనే స్థిరపడిపోవాలని ఎంతో మంది కల.

గల్లీ కాలేజ్ నుంచి ఐఐటిల దాకా పట్టా పుచ్చుకుని బయటకొచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది విదేశాలకు వెళ్లిపోతున్నారనే విమర్శ ఉంది.అయితే ప్రతిభావంతులు ఇండియా వదిలి వెళ్లొద్దని దేశ సేవకు పాటుపడాలని పలువురు సూచిస్తున్నారు.

మొన్నామధ్య కిర్లోస్కర్ బ్రదర్స్ సీఎండీ సంజయ్ కిర్లోస్కర్ సైతం యువతకు ఇదే చెప్పారు.కానీ వినేవారెవ్వరు.అయితే దీనిని ఆచరణలో చేసి చూపాడో వ్యక్తి.

ప్రపంచంలోనే అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఖ్యాతి తెచ్చుకున్న ఓ భారతీయ యువకుడు.విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చేశారు.

సొంతూరు వచ్చేసి కాలేజీ లెక్చరర్ పరీక్ష రాసి ఎవ్వరూ వెళ్లడానికి సాహసించని మారుమూల పోస్టింగ్ తీసుకుని విద్యార్థులను చైతన్య పరుస్తున్నాడు.ఆయన పేరు డాక్టర్ షకీల్ అహ్మద్.

Advertisement

ఉగ్రవాదులకు స్వర్గధామమైన కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని మేంధార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కెమెస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.డాక్టర్ అహ్మద్ సాదాసీదా కాలేజీల్లోనే చదవుకున్నారు.

రాజౌరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ తర్వాత ఢిల్లీ జామియాలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశారు.అనంతరం అక్కడే పీహెచ్‌డీ 2016లో పూర్తిచేశారు.

తర్వాత 2017లో ఢిల్లీ ఐఐటిలో పోస్టు డాక్టోరల్‌ చేశారు.షకీల్ అహ్మద్ భార్య డాక్టర్ అను చౌదరి కూడా మరొక డిగ్రీ కాలేజీలో లెక్చరర్.

ఆమెతో కలసి ఈ ప్రాంత విద్యార్థుల్లో ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఒక ఎన్జీవోను ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాను మా ప్రాంతం రుణం తీర్చుకోవాలనుకున్నాను.ఇక్కడ మంచి చదువు దొరకడం చాలా కష్టం.నేను పుట్టీ పుట్టగానే మా తండ్రి చనిపోయారు, స్కాలర్ షిప్ లతో చదువు పూర్తి చేశానని షకీల్ గుర్తుచేసుకున్నారు.

Advertisement

ఈ కష్టం నాకు తెలుసు కాబట్టి, వెనకబడిన ఈ ప్రాంతంలోనే ఉండి విద్యార్జులకు సాయం చేయాలనుకున్నానని షకీల్ తెలిపారు.అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పాలిమర్ కెమిస్ట్రీలో తయారు చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల లిస్టులో డాక్టర్ షకీల్ చోటు దక్కించుకున్నారు.

ఇంత సాధించినా ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలే.ఈనాటికే ఆయన పాలిమర్ కెమెస్ట్రీలో రాసిన 30 పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌ పబ్లిష్ అయ్యాయి.అంతేకాదు ఈ రంగంలో షకీల్ 15 పుస్తకాలు రాశారు.

ఈ చిన్న వయసులోనే ఆయనకు అమెరికన్ కెమికల్ సొసైటీలో, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం లభించింది.అలాగే ఏషియన్ పాలిమర్ అసోసియేషన్‌, భారత్‌లోని సొసైటీ ఆఫ్ మెటీరియల్ కెమిస్ట్రీలో కూడా జీవితకాల సభ్యుడు.

పాలిమర్స్ అంటే ప్లాస్టిక్ వంటి పదార్ధాలు.ఇవి వాతావారణాన్ని కలుషితం చేస్తున్నాయని, అలాగే వదిలేస్తే కొన్ని వేల సంవత్సరాలు కుళ్లిపోకుండా ఉండి భూగోళానికి హాని చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అందువల్ల తొందరగా కుళ్లిపోయే ప్లాస్టిక్ తయారు చేస్తే… ఇదే ఇపుడు డాక్టర్ షకీల్ అహ్మద్ చేస్తున్నది.ఆయన బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ తయారీ మీద పరిశోధనలు చేస్తున్నారు.

తాజా వార్తలు