దర్శకుడుగా సముద్రఖని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కంటెంట్ బేస్ సినిమాలని తమిళంలో తెరకెక్కించిన దర్శకుడుగా మంచి గుర్తింపు ఉంది.
దర్శకుడుగా ఉంటూనే నటుడుగా కూడా కోలీవుడ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలలో మెప్పించిన ఇతను ఆల వైకుంఠపురంలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో డిఫరెంట్ మేనరిజంతో పవర్ ఫుల్ విలన్ గా కనిపించి సందడి చేశాడు.
ఇందులో అతని నటనకి మంచి మార్కులు పడ్డాయి.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలక పాత్రలో సముద్రఖని కనిపించబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగు సినిమాకి అతను ఒకే చెప్పాడు.అది కూడా సుకుమార్ దర్శకత్వంలో సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాని స్టార్ట్ చేశాడు.
ఈ సినిమా షూటింగ్ త్వరలో రంపచోడవరం ఫారెస్ట్ లో స్టార్ట్ చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
అలాగే కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
తిరుమల ఫారెస్ట్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సముద్రఖనిని ఫైనల్ చేశారని తెలుస్తుంది.
అతను నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అని సమాచారం.త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy