ఆ ముగ్గురు లెజెండరీల కథతో సినిమా... ఆసక్తి చూపిస్తున్న దర్శకుడు

దక్షిణభారతం మెచ్చే దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది అభిమానులకి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోయారు.

భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా పాటలతో, మాటలతో ఎప్పటికి కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

అలాంటి గాన గంధర్వుడు జీవిత విశేషాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.ఎస్పీ బాలు పాట గురించి తెలిసినంతగా ఆయన జీవితం గురించి తెలియదు.

అలాగే అతని ప్రస్తానం ఎలా మొదలైంది, చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలు చాలా మందికి తెలియవు.అయితే ఇప్పుడు ఓ దర్శకుడుకి బాలు జీవితం సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం మీద సినిమా తియ్యాలని వుందని తమిళ పదం వన్, తమిళ పదం టూ సినిమాల డైరెక్టర్ సి.ఎస్.అముధన్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశాడు.కేవలం బాలు మీద మాత్రమే కాకుండా బాలుతో సహా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, డైరెక్టర్ భారతీరాజా స్నేహం మీద సినిమా తియ్యాలని వుందని చెప్పాడు.

Advertisement

గాయకుడిగా బాలు షోలు చేస్తున్నప్పుడు ఇళయరాజాకు ఆయన తన మ్యూజిక్ ట్రూపులో అవకాశం ఇచ్చారు.సంగీత దర్శకుడిగా ఉన్నత శిఖరాలకు ఇళయరాజా ఎదిగిన తరవాత స్నేహితుడు బాలుతో ఎన్నో పాటలు పాడించారు.

ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు.భారతీరాజాకి కూడా వీళ్ళతో మంచి స్నేహ బంధం వుంది.

గొప్ప గాయకుడు, గొప్ప సంగీత దర్శకుడు, గొప్ప దర్శకుడిగా ఎదిగిన ముగ్గురు స్నేహితుల ప్రయాణంతో ఈ కథని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు సి.ఎస్.అముధన్ తెలియజేశాడు.సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్నేహానికి చిరునామా అయిన వీరి ముగ్గురు కథతో సినిమా అంటే చాలా నిర్మాతలు ముందుకి వస్తారు.

మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు