'రేషన్ కార్డ్' వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే వెంటనే ఇలా చేయండి!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పథకం వన్ నేషన్, వన్ రేషన్ పథకాన్ని దాదాపు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల లోనూ అమలవుతుంది.

ఈ పథకం ద్వారా ఎన్నో లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.

అయితే ప్రస్తుతం రేషన్ కార్డ్ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే రేషన్ కార్డు ఆధార్ అనుసంధానం సెప్టెంబర్ 30 తేదీ లోపు చేయాలని గడువు నియమించింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులు కూడా ఈ రంగంలోకి దిగి పోర్టబుల్ ఫెసిలిటీ ని అందిస్తున్నాయి.అయితే గడువులోగా ఆధార్ అనుసంధానం చేయకపోతే, రేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, ఆధార్ అనుసంధానం తప్పనిసరి.

అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పనిలో పడ్డాయి.ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది.

Advertisement

ఎవరి రేషన్ కార్డులో అయితే వారి పేరు, అడ్రస్, వయస్సు వంటి వివరాలు తప్పుగా ఉన్నాయో, వాటిని రీ కరెక్ట్ చేయడానికి ఒక్కొక్క రేషన్ కార్డు నుండి 25 రూపాయలు రుసుం చెల్లించాల్సి ఉంది గా ఉత్తర్వులలో పేర్కొనబడినది.అయితే కొన్ని రాష్ట్రాలలో ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

మరికొన్ని రాష్ట్రాలలో ఇలాంటి వివరాలను ఎలాంటి చార్జీలు లేకుండా, ఉచితంగా రీ కరెక్షన్ చేస్తున్నారు.అయితే వీటిపై చార్జీలు తీసుకోవడం, లేదా అన్నటువంటి నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది.

అయితే నిర్ణీత గడువు సమయం లోపు ప్రతి ఒక్కరి రేషన్ కార్డ్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.ఇలా అనుసంధానం కాకపోయినా ఎడల వారికి రేషన్ కార్డు లిస్టు లో వారి పేరు గాని, వారికి రేషన్ గాని రావు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు