పైసల్ ఇవ్వకపోతే నోయల్ ను బ్యాడ్ చేస్తారా?

బిగ్ బాస్ సీజన్ 4.ప్రారంభమై పది రోజులు అవుతుంది.

మొదటి వారం అంతా గొడవలు సరిపోగా ఈ వారం అంతా ఎంటర్టైన్మెంట్ ఏ ఉంది.

డ్యాన్సులు తప్ప ఈ షో లో ఏం కనిపిస్తలేవు.

బిగ్ బాస్ రియాలిటీ షో కంటే కూడా డ్యాన్స్ షోలానే ఎక్కువ కనిపిస్తుందని వార్తలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయ్.ఇక ఈ విషయాలు అన్ని పక్కన పెడితే.

బిగ్ బాస్ హౌస్ లో ఏ మాత్రం పెర్ఫార్మన్స్ లేకున్నా ఆ కాంటస్టెంట్లకు బయట భారీ ఎత్తున ప్రేమోషన్స్ జరుగుతున్నాయ్.రాజకీయ నాయకులు గెలవడం కోసం టీమ్ ఏర్పాటు కంటే కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్మీనే చాలా పెద్దగా ఉంటుంది.

Advertisement

ఎవరికి వారు ప్రేమోషన్లు చేసుకుంటూ చెలరేగిపోతున్నారు.అయితే ఈ ప్రేమోషన్స్ చేసే వారు కూడా ఎవరిని వారిని హైలెట్ చేసుకోకుండా పక్క వారిలో తప్పులు చూపి వారిపై వ్యతిరేకతను సృష్టిస్తున్నారు.

ఇక అలానే నోయల్ పై కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.లాస్ట్ వీక్ లో నోయల్ అతి ఆలోచనల కారణంగా అతనిపై ట్రోల్ చెయ్యడంతో ప్రేక్షకుల్లో దారుణంగా నెగిటివిటీ పెరిగింది.

ఈ నోయల్ ఒకడు అన్నింటిలోకి దూరుతాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.దీంతో నోయల్ పై ఓ ఇంస్టాగ్రామ్ పేజీ రోజు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంది.

ఈ విషయంపైనే రాహుల్ సిప్లిగుంజ్ ఫైర్ అయ్యాడు. పైసల్ ఇవ్వకపోతే ట్రోల్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీనిపై ఎటువంటి స్పందన లేకపోయినప్పటికి నోయల్ కి బయట గట్టిగ సపోర్ట్ ఉందని ఈ విషయంతో అర్థం అవుతుంది.నోయల్ కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ తగ్గించుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

Advertisement

మరి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో చూడాలి.

తాజా వార్తలు