కరోనా కాలం... మాస్క్ లేదని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్?

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది.ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి సోకుతుందో తెలియని ఈ వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

ప్రపంచ దేశాల్లో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.కరోనా వైరస్ మనుషుల జీవన విధానంలో అనేక మార్పులను తీసుకొచ్చింది.

మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి తరచూ శానిటైజర్ ను వినియోగిస్తే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.మన దేశంలో భారీ జరిమానాలు ఎక్కడా విధించడం లేదు కానీ పలు దేశాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు.

పలు దేశాల్లో నిబంధనలు పాటించని వారికి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తూ ఉండటం గమనార్హం.పలు దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తూ లాక్ డౌన్ ను సడలిస్తున్నాయి.

Advertisement

ఇంటి నుంచి ఎవరైనా బయటకు అడుగు పెట్టారంటే మాస్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే.అయితే అధికారులు నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కొందరు మాత్రం మాస్క్ ధరించడానికి ఆసక్తి చూపడం లేదు.

తాజాగా 32 సంవత్సరాల బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి టర్కీలోని అంతల్య ఎయిర్‌పోర్టులోని విమానంలో మాస్క్ ధరించకుండానే ఎక్కాడు.విమాన సిబ్బంది ఆ ప్రయాణికుడిని గుర్తించి మాస్క్ ధరించాలని సూచనలు చేశారు.

అయితే ఎంత చెప్పినా ఆ వ్యక్తి మాస్క్ ధరించడానికి ఆసక్తి చూపలేదు.ఇతర ప్రయాణికులు కూడా అతనికి మాస్క్ ధరించాలని చెప్పినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.పోలీసులు మాస్క్ ధరించని వ్యక్తిని అరెస్ట్ చేసిన అనంతరం విమానం గాల్లోకి ఎగిరింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

గతంలో డెట్రాయిట్ లో కూడా ఒక వ్యక్తి మాస్క్ ధరించకపోవడంతో సిబ్బంది ఆ వ్యక్తిని విమానం నుంచి దించేశారు.

Advertisement

తాజా వార్తలు