సర్వే: కరోనా దెబ్బ పడినా.. కెనడాకు ఢోకా లేదు, త్వరలోనే భారీగా నియమాకాలు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

దీని కారణంగా సంపన్న దేశాలతో పాటు పేద దేశాల్లో సైతం అన్ని రంగాలు కుదేలవుతున్నాయి.

ఆర్ధిక నష్టాల కారణంగా ఎన్నో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగులను తీసివేస్తున్నాయి.అయితే ఇందుకు భిన్నంగా కెనడాలో మాత్రం త్వరలో 7 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం వుందని నావోస్ రీసెర్చ్ సర్వే తెలిపింది.

కరోనా దెబ్బతో 30 శాతం ఉద్యోగాలు కోల్పోయారని, ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడంతో పలు సంస్థలు తిరిగి ఉద్యోగులను నియమించుకుంటున్నాయని సర్వే తెలిపింది.కాగా ఈ మహమ్మారి కారణంగా కెనడాలో సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, అందులో ప్రస్తుతం 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం వుందని నావోస్ సర్వే తెలిపింది.

ఈ సర్వేను జూన్ 28 నుంచి జూలై 2 తేదీల్లో నిర్వహించారు.మరోవైపు కెనడాలో ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని, త్వరలోనే కొత్త వారికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

ఇమ్మిగ్రేషన్‌పై డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల కారణంగా టెక్ వర్కర్లతో పాటు విదేశీ విద్యార్ధులు కెనడా వైపు చూస్తున్నారు.కంప్యూటర్ ప్రొగ్రామర్లు, ఇంటరాక్టివ్ మీడియా డెవలపర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనలిస్టులు, కన్సల్టెంట్లు కేటగిరీల కింద 23 వేల మందికి కెనడా వీసాలు జారీ చేసినట్లు గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ (జీఎస్ఎస్) తెలిపింది.

కోవిడ్ 19 లాక్‌డౌన్ నుంచి ఉపశమనం తర్వాత కెనడాకు టెక్ వర్కర్లు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు