సినిమాలు లేవని పవన్ ఏం చేశాడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఇదెలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని పవన్ భావిస్తున్నాడు.

కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా వకీల్ సాబ్‌కు చెందిన మరో 10 రోజుల షూటింగ్ వాయిదా పడింది.అయితే ఇప్పట్లో షూటింగ్‌లలో పాల్గొనేందుక ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో పవన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

బుధవారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పవన్ చాతుర్మాస్య దీక్షను చేపట్టాడు.ప్రజలు క్షేమంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలని ఆయన భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కఠిన దీక్షను తీసుకున్నాడట.

Advertisement

ఈ దీక్షలో భాగంగా పవన్ చాలా కఠినమైన నియమాలు పాటించనున్నాడు.బ్రహ్మ చర్యం, ఒంటి పూట భోజనం, భూతల శయనం, నదీ స్నానం వంటి అనేక కఠిన నియమాలను పవన్ పాటించనున్నట్లు తెలుస్తోంది.

నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్ ఉంటాడని, అప్పటివరకు మరెలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోడన ఆయన సన్నిహితులు అంటున్నారు.ఏదేమైనా పవన్ ప్రజల కష్టాలను చూసి ఇలాంటి కఠినమైన దీక్షను చేపట్టాడని జనసైనికులు అంటున్నారు.

ఇక వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో విరూపాక్ష అనే సినిమాను కూడా పవన్ లైన్‌లో పెట్టాడు.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు