మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్త మెగా ఫ్యాన్స్‌లో నెలకొన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే చరణ్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో రెండు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇందులో ఒకటి చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్ కాగా మరొకటి చరణ్ పాత్రకు సంబంధించి ఉంటుందని తెలుస్తోంది.ఈ రెండు ఎపిసోడ్స్ కూడా సినిమా కథను కీలకంగా మార్చనున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ గురించి చిత్ర దర్శకుడు కొరటాల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని తెలుస్తోంది.
అటు చిరు పాత్ర కూడా ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో చిరు సరసన తొలుత త్రిషను హీరోయిన్‌గా తీసుకున్నా, ఆమె ఈ సినిమా నుండి వాకౌట్ చేయడంతో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
మరి ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.